బూస్ట్, హార్లిక్స్ చేతులు మారాయి.. యూనీలివర్‌తో గ్లాస్కో స్మిత్ క్లైన్ విలీనం

మంగళవారం, 4 డిశెంబరు 2018 (17:16 IST)
యూనీలివర్‌తో గ్లాస్కో స్మిత్ క్లైన్ విలీనం కానుంది. తద్వారా యూనీలివర్ సంస్థ జీఎస్కేకు చెందిన హెల్త్ ఫుడ్ డ్రింక్స్ వ్యాపారాన్ని హస్తగతం చేసుకోనుంది. రూ.27,750కోట్లతో ఈ ఒప్పందం కుదిరింది. ఫలితంగా హార్లిక్స్, బూస్ట్ వంటి బ్రాండ్లు యూనీలివర్ సొంతం కానున్నాయి. జీఎస్‌కే పీఎల్‌సీకి చెందిన ఆసియా హెల్త్ ఫుడ్ డ్రింక్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఆంగ్లో-డచ్ దిగ్గజం యూనిలివర్ ప్రకటించింది. 
 
హార్లిక్స్ బ్రాండ్‌ను సొంతం చేసుకునేందుకు నెస్లే, యూనిలివర్ మధ్య పోటాపోటీ సాగింది. శీతల పానీయ సంస్థ కోకాకోలా కూడా పోటీ పడింది. చివరకు యూనీలివరే నెగ్గింది. ఈ వ్యూహాత్మక విలీనం ద్వారా దేశంలోని గొప్ప బ్రాండ్లు మా పోర్ట్‌ఫోలియోలోకి చేరనున్నాయని హెచ్‌యూఎల్ ఛైర్మన్ కంపెనీ సీఈఓ సంజీవ్ మెహతా తెలిపారు. విలీనం తర్వాత సంస్థ వ్యాపారం టర్నోవర్ రూ.10వేల కోట్ల మైలురాయిని అధిగమించనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు