రుణాల విషయంలో వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కదులుతూ ఉంటాయి. గృహరుణం 15, 20 ఏళ్ల దీర్ఘకాలిక అప్పు. ఈ వ్యవధిలో ఎన్నోసార్లు వడ్డీ రేట్లు తగ్గడం పెరగడం చూస్తుంటాం. కాబట్టి, ఈ విషయాన్ని ప్రతికూల దృష్టితో చూడొద్దు. వడ్డీ రేటు పెరిగినా.. ఈఎంఐపై దాని ప్రభావం ఉండదు. కాబట్టి, మీ నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం ఉండదు. కేవలం వ్యవధి మాత్రమే పెరుగుతుంది. మళ్లీ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు.. వ్యవధీ సర్దుబాటవుతుంది.
రుణానికి చెల్లించే ఈఎంఐలు ఎప్పుడూ సకాలంలో చెల్లించేయండి. లేకపోతే ఆలస్యపు రుసుములు వసూలు చేస్తాయి బ్యాంకులు. దీనివల్ల అనవసర భారం పడుతుంది. క్రెడిట్ స్కోరు దెబ్బతినడం వల్ల కొత్త అప్పు తీసుకోవాలనుకున్నప్పుడు వడ్డీ రేటు మనకు అనుకూలంగా ఉండదు. మూడు నెలలకు సరిపడా ఈఎంఐ ఎప్పుడూ సేవింగ్ బ్యాంకు ఖాతాలో ఉండేలా జాగ్రత్త తీసుకోండి.