శక్తివంతమైన 5.5 హెచ్‌పీ పవర్‌ టిల్లర్‌ను విడుదల చేసిన హోండా ఇండియా పవర్‌

శనివారం, 3 జులై 2021 (19:45 IST)
భారతదేశంలో పవర్‌ ప్రొడక్ట్స్‌ తయారీలో అగ్రగామి సంస్ధగా వెలుగొందుతున్న హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (హిప్‌) నేడు విస్తృతశ్రేణిలోని  వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు తమ నూతన కంపాక్ట్‌ పవర్‌ టిల్లర్‌ ఎఫ్‌క్యు 650ను విడుదల చేసింది.
 
కూరగాయలు, మసాలా దినుసులు, ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటలు సాగు చేయడంతో పాటుగా తోటలు మరియు నర్సరీల నిర్వహణలోని రైతులు సౌకర్యవంతమైన, ఆర్థికంగా అనుకూలమైన పవర్‌ టిల్లర్‌ను కోరుకోవడంతో పాటుగా ఆ పవర్‌ టిల్లర్‌లు వైవిధ్యమైన వ్యవసాయ కార్యకలాపాలైనటువంటి దున్నటం, సాగు చేయడం, గట్లు ఏర్పాటుచేయడం మరియు కలుపుతీత కార్యక్రమాలను  సమర్థవంతంగా చేయాలనుకుంటున్నారు.
 
వ్యవసాయంలో హోండా యొక్క లెజండరీ 4 స్ట్రోక్‌ సాంకేతికతను పరిచయం చేయడంలో హెచ్‌ఐపీపీ ముందుంది మరియు విజయవంతంగా తమ ప్రీమియం మోడల్‌ ఎఫ్‌జె500ను  ఆవిష్కరించడంతో పాటుగా కంపాక్ట్‌ మోడల్‌ ఎఫ్‌300ను గ్యాసోలిన్‌ ఇంధనం కలిగిన పవర్‌ టిల్లర్‌ విభాగంలో సైతం శక్తివంతమైన, మన్నికైన సహచరిని భారతీయ రైతులకు అందిస్తుంది.
 
తమరోజువారీ కార్యకలాపాల కోసం శక్తివంతమైనప్పటికీ అందుబాటు ధరలో పవర్‌ టిల్లర్‌ కావాలని సుదీర్ఘకాలంగా రైతులు ఎదురుచూస్తోన్న ప్రాధమిక కంపాక్ట్‌ టిల్లర్‌ అవసరాలను తాజా ఎడిషన్‌ ఎఫ్‌క్యు 650 తీరుస్తుంది.
 
ఎఫ్‌క్యు 650లో మన్నికైన హోండా జీపీ200హెచ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 5.5 హెచ్‌పీ శక్తిని అందించడంతో పాటుగా అత్యుత్తమ శ్రేణి పనితీరును 2500 ఆర్‌పీఎం వద్ద 12.4 ఎన్‌ఎం టార్క్‌ను మరియు టిల్లింగ్‌ వెడల్పు 900 మిల్లీమీటర్లతో 300 ఎంఎం టిన్‌ డయా కలిగి పలు వ్యవసాయ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఎఫ్‌క్యు650 సాటిలేని ఇంధన సామర్థ్యంను అందించడంతో పాటుగా తమ శ్రేణిలో అతి తక్కువగా 65.2 కేజీల బరువు కలిగి, సౌకర్యవంతమైన, మన్నికైన, శక్తివంతమైన మరియు తక్కువ ధరలోని పరిష్కారం కోరుకుంటున్న రైతుల అవసరాలను తీర్చనుంది.
 
ఈ ఆవిష్కరణ గురించి గగన్‌ పాల్‌- వైస్‌ ప్రెసిడెంట్- హెడ్‌ ఆఫ్‌ సేల్స్‌, మార్కెటింగ్‌ అండ్‌ సర్వీస్- హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘వ్యవసాయ పనుల యాంత్రీకరణ మరియు సమర్థత వృద్ధి చెందుతున్న వేళ, రైతుల నడుమ కంపాక్ట్‌ టిల్లర్స్‌ కోసం డిమాండ్‌ భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో సైతం  గణనీయంగా వృద్ధి చెందుతుంది. ఎన్నో సంవత్సరాలుగా భారతీయ రైతుల ఎంపికగా హోండా టిల్లర్స్‌ నిలుస్తున్నాయి.
 
ఈ నూతన మోడల్‌ మరింతగా వారి సాధారణ వ్యవసాయ కార్యక్రమాలను యాంత్రీకరణ చేసుకోవడంలో  సహాయడుతుంది, తద్వారా వారి వ్యవసాయ ఉత్పాదకత వృద్ధి చేసుకోవడంలోనూ సహాయపడుతుంది. హోండా ఎఫ్‌క్యు650 అత్యంత శక్తివంతమైన, సౌకర్యవంతమైన, అతి తక్కువ ఖర్చుతో కూడిన మరియు అతి సులభంగా, అతి తక్కువ ఖర్చుతో సులభంగా వినియోగించతగిన టిల్లర్‌గా నిలువడంతో పాటుగా వయసుతో మరియు స్త్రీ, పురుషులు అనే బేధం లేకుండా సులభంగా, సురక్షితంగా వినియోగించుకునేందుకు సైతం తోడ్పడుతుంది’’ అని అన్నారు.
 
ఎఫ్‌క్యు650ను ‘ఆపరేటర్ల భద్రత ముందు’ విధానం మరియు ‘వినియోగదారులకు అనుకూలం’ దృష్టితో తయారుచేశారు. ఎఫ్‌క్యు650 లో ఆపరేటర్‌ ఉనికి నియంత్రణ వ్యవస్థ, బర్డ్‌ కేజ్‌ మఫ్లర్‌ గార్డ్‌,  సురక్షిత వినియోగం కోసం భారీ పరిమాణంలో సబ్‌-ఫెండర్‌ ; గేర్‌ షిప్టింగ్‌ గేట్‌ వంటివి సౌకర్యవంతంగా గేర్లను మార్చడంలో సహాయపడుతూనే ప్రాధాన్యతా నిర్వహణ  వేగానికి తగినట్లుగా తోడ్పడతాయి. సౌకర్యవంతమైన ఫీచర్లు అయినటువంటి టైర్లు, ఫ్రంట్‌ స్టాండ్‌ మరియు హ్యాండిల్‌ బార్‌ ఎత్తు మార్చుకోతగిన వీలు వంటివి దీనిని జెండర్‌ న్యూట్రల్‌గా మార్చడంతో పాటుగా తొలి సారి వినియోగించే వారికి కూడా అత్యుత్తమంగా తోడ్పడుతుంది.
 
నీటి మార్గాలు ఏర్పరిచేందుకు మరియు  వేరు పంటల సాగు కోసం ప్రభావవంతంగా గట్ల ఎత్తు పెంచడం, గడ్డి ఎత్తుగా సాగుచేసేందుకు బ్లూ స్పైరల్‌తో పాటుగా  తరచుగా కలుపుతీత కార్యక్రమాలను సైతం చేసేందుకు స్టాండర్డ్‌ ఫ్లవర్‌ టైన్‌ వంటి అదనపు అనుకూల తోడ్పాటులు సైతం ఎఫ్‌క్యు 650తో వస్తాయి. నూతనంగా ఆవిష్కరించిన పవర్‌ టిల్లర్‌ ఎఫ్‌క్యు650 ఇప్పుడు దేశ వ్యాప్తంగా 500కు పైగా హోండా ఆధీకృత రిటైల్‌ డీలర్‌షిప్‌ ఔట్‌లెట్లు వ్యాప్తంగా లభ్యమవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు