భారతదేశం ఆరో సంపన్నదేశం... హైదరాబాద్‌లో 9000 మంది మిలయనీర్లు, ఏపీ సంగతేంటి?

బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (14:29 IST)
ప్రపంచంలో 10 సుసంపన్నమైన దేశాల జాబితాలో భారతదేశానికి 6వ స్థానం దక్కింది. గత ఏడాది డిసెంబరు నెల నాటికి భారతదేశ సంపద విలువ 6.2 లక్షల కోట్ల డాలర్లుగా వున్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో భారతదేశంలోని సంపన్న నగరాలను కూడా తెలియజేసింది. 
 
ముంబైలో 46 వేల మంది మిలియనీర్లు వుండగా, కోల్ కతాలో 9,600 మంది, హైదరాబాద్ నగరంలో 9 వేల మంది, బెంగళూరులో 7,700 మంది, చెన్నైలో 6,600 మంది, పుణెలో 4,500 మంది, గుర్గావ్ 4 వేల మంది వున్నట్లు జాబితాలో పేర్కొంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లెక్కేంటో తెలియాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి