ఫ్యాషన్‌తో సస్టెయినబిలిటీని ముందుకు తీసుకువెళ్లేందుకు గూంజ్‌తో లైఫ్‌స్టైల్‌ భాగస్వామ్యం

మంగళవారం, 5 జులై 2022 (18:47 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ ఫ్యాషన్‌ కేంద్రం, లైఫ్‌స్టైల్‌ ఇప్పుడు సస్టెయినబిలిటీని ప్రోత్సహిస్తూ ఓ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం కోసం గూంజ్‌తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, డొనేషన్‌ బాక్స్‌లను దేశవ్యాప్తంగా 60 లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. వీటి ద్వారా వినియోగించని వస్త్రాలను రీసైక్లింగ్‌ చేయడంతో పాటుగా నిరుపేద సమాజాల అభివృద్ధి దిశగా వాటిని వినియోగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జూలై 4వ తేదీన లైఫ్‌స్టైల్‌ ఒయాసిస్‌ మాల్‌ స్టోర్‌,  బెంగళూరు వద్ద  ప్రారంభించారు. లైఫ్‌స్టైల్‌ మరియు గూంజ్‌కు చెందిన కీలక ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని డొనేషన్‌ బాక్స్‌లను ప్రారంభించారు.

 
ఈ కార్యక్రమంతో, లైఫ్‌స్టైల్‌ ఇప్పుడు పరివర్తన పూరకమైన మార్పును తీసుకురావడం లక్ష్యంగా చేసుకుంది. అదే సమయంలో ప్రజలతో పాటుగా పర్యావరణం యొక్క శ్రేయస్సు కోసం ఫ్యాషన్‌ను వినియోగించాలని కోరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సేకరించే వస్త్రాలను రీసైకిల్‌ చేయడం లేదా వాటిని ప్రతి రోజూ అవసరాల కోసం గూంజ్‌ వాటిని పునఃవినియోగించడం చేయనుంది. తద్వారా భారీ మొత్తంలో ఫ్యాషన్‌ వస్త్రాలు భూగర్భంలో కలిసే అవకాశం తప్పుతుంది. తద్వారా సస్టెయిబిలిటీకి తోడ్పాటునందించడమూ వీలవుతుంది.

 
లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్ధ గూంజ్‌. ఇది నగర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కమ్యూనిటీల నెట్‌వర్క్‌ను నిర్మిస్తుంటుంది. గ్రామీణ మౌలిక వసతులు, నీరు, పర్యావరణం, జీవనోపాధి, విద్య,ఆరోగ్యం, విపత్తు ఉపశమనం, పునరావాస కార్యక్రమాలలో అత్యంత కీలకమైన అంతరాలను పూరించడంలో మెటీరియల్‌ ఛానలైజింగ్‌ కీలకమని భావిస్తోంది. ఈ సంస్థ దయ, గౌరవం మరియు విలువల నడుమ సంబంధాలను నిర్వహించడంతో పాటుగా నిర్మిస్తుంది.
 
ఈ సందర్భంగా లైఫ్‌స్టైల్‌ మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోహిణి హల్డీయా మాట్లాడుతూ, ‘‘భారతదేశ వ్యాప్తంగా  వెనుకబడిన వర్గాల ప్రజల అభ్యున్నతికి, వారి గౌరవాన్ని పెంపొందించే దిశగా భారీ ప్రయత్నాలను చేస్తోన్న గూంజ్‌తో భాగస్వామ్యం చేసుకున్నామని వెల్లడించేందుకు చాలా సంతోషంగా ఉంది. సమాజ అభివృద్ధి అనేది సమ్మిళిత బాధ్యత అని లైఫ్‌స్టైల్‌ బలంగా విశ్వసిస్తోంది. తక్కువగా వినియోగించే ఫ్యాషన్‌ను   రీసైక్లింగ్‌ చేసే అవకాశం కల్పించడం ద్వారా దీనిని  సాధ్యం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని అన్నారు.

 
గూంజ్‌ ఫౌండర్‌ , మెగసెస్సే అవార్డు గ్రహీత అన్షు గుప్తా మాట్లాడుతూ, ‘‘లైఫ్‌స్టైల్‌తో కలిసి ప్రారంభించిన ఈ కార్యక్రమం ఎన్నో రకాలుగా అత్యంత కీలకమైనది. మరో వైపు ఇది, మొత్తం రిటైల్‌ రంగానికి అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తూనే, ప్రతి సంస్ధ తమంతట తాముగా ఏం చేయవచ్చనేది తెలుపుతుంది. మరీ ముఖ్యంగా ప్రతి వినియోగదారుడు ఇతరుల కోసం ఎంతో కొంత సహాయం చేసే అవకాశం కల్పిస్తుంది.  ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నో వస్త్రాలు వ్యర్థంగా భూమిలో కలవకుండా చేసే అవకాశమూ లభిస్తుంది. అదే సమయంలో ప్రపంచ అభివృద్ధికి తోడ్పడుతూనే  గౌరవం పెంపొందించడంలో నూతన పాత్రనూ పోషిస్తాయి. ఇది అందరికీ సమాన విజయాన్ని అందిస్తుంది అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు