వస్తు సేవల పన్ను బిల్లును గట్టెక్కించేందుకు ఎన్డీఏ ప్రయత్నాలు

సోమవారం, 25 జులై 2016 (11:38 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లను గట్టెక్కించేందుకు బీజేసీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గట్టెక్కించేందకు ముమ్మర ప్రయత్నాలే చేస్తోంది. ఇందుకోసం ముందుగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమై వారి అభ్యంతరాలపై చర్చించిన తర్వాతే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ భావిస్తున్నారు. 
 
మరోవైపు బిల్లును గట్టెక్కించేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ సమావేశంలో చర్చించిన అనంతరం రాజ్యసభలో బిల్లు పెట్టనున్నారు. విపక్షాలతో పాటు.. ఆర్థిక నిపుణులు చూసించే మార్పులు చేర్పులు కూడా చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 
 
మరోవైపు.. జీఎస్టీ బిల్లుకు సంబంధించి కొన్ని సవరణలు చేయాలని కాంగ్రెస్‌ పట్టుపడుతోంది. రాష్ట్రాల చేతిలో ఉన్న ఒక్క శాతం అదనపు పన్ను సహా కీలక అంశాల్లో సవరణలు చేయాలని కోరుతోంది. రాష్ట్రాల మధ్య రెవెన్యూ పంపకాల్లో సమస్యల పరిష్కారానికి స్వతంత్య్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. దీని కోసం ప్రాంతీయ పార్టీల మధ్దతు కోరుతోంది. 

వెబ్దునియా పై చదవండి