బొగ్గు క్షేత్రాల తరహాలోనే చమురు క్షేత్రాల కేటాయింపులు : కేంద్రం నిర్ణయం

బుధవారం, 2 సెప్టెంబరు 2015 (13:43 IST)
బొగ్గు క్షేత్రాలను ఏ విధంగా కేటాయిస్తున్నారో అదేవిధంగానే చమురు క్షేత్రాల కేటాయింపులు జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు నిర్ణయించింది. 
 
ప్రస్తుతం చమురు క్షేత్రాల కేటాయింపుల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానం వల్ల రిలయన్స్ వంటి కొన్ని సంస్థలు మాత్రమే గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు వీలుగా కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. 
 
ఇందులోభాగంగా బొగ్గు గనుల కేటాయింపు కోసం చేపట్టిన వేలం ప్రక్రియ తరహాలోనే చమురు క్షేత్రాలకు కూడా వేలం పాట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ-వేలం పాటల ద్వారా బొగ్గు గనులను కేటాయిస్తున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి