వంట నూనె: లీటర్‌పై రూ.12 తగ్గింపు

శనివారం, 6 ఆగస్టు 2022 (15:12 IST)
దేశంలో వంట నూనెల ధరలు లీటరుపై దాదాపు రూ.10 నుంచి రూ.12 మధ్య తగ్గే అవకాశం ఉంది. ఇటీవల వంట నూనెల తయారీ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. 
 
అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దేశంలోనూ తగ్గించాలని తయారీ సంస్థలకు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ సూచించడంతో అందుకు ఆయా సంస్థలు అంగీకరించాయి.
 
వంట నూనెల ధరలు తగ్గిస్తామని తయారీ సంస్థల ప్రతినిధులు చెప్పారు. ఇటీవల పలు సంస్థలు వంట నూనెల ధరలను తగ్గించాయి. అదానీ విల్మర్ సంస్థ వంట నూనె ధరను లీటరుకు రూ.30 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సోయా నూనెల ధరలను అధికంగా తగ్గించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు