న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, అనుష్క మీడియాతో మాట్లాడారు. తన బిజీ లైఫ్ కారణంగా అనేక రసాయనాలు, దుమ్ము, ధూళికి కురులు చెడిపోయిన విషయాన్ని గమనించానని అనుష్క శర్మ తెలిపింది.
ఈ నేపథ్యంలో ప్యాంటీన్ వాళ్లు తమ బ్రాండ్ అంబాసిడర్గా రావాలని కోరినప్పుడు ఆ ఉత్పత్తులు తన కేశ సంరక్షణకు ఉపయోగపడతాయా అనే అనుమానం వచ్చిందని, అందుకే ముందుగా ఆ ఉత్పత్తుల్ని ఉపయోగించానని తెలిపింది. ముందుగా తాను ఆ ప్రాడెక్టులు వాడి చూసి సంతృప్తి చెందిన తరువాతనే, ప్రచారకర్తగా ఉండేందుకు ఒప్పుకున్నట్టు వివరించింది.