వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

బుధవారం, 23 మార్చి 2022 (08:49 IST)
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. మంగళవారం నుంచి ఈ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్‌ ధర రూ.96.36కు చేరింది.
 
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో పెట్రోల్‌ రూ.112.80, డీజిల్‌ రూ.98.10, విజయవాడలో పెట్రోల్‌ రూ.111.88, డీజిల్‌ రూ.97.90కి చేరాయి.
 
దేశరాజధాని న్యూఢిల్లీలో 80 పైసల చొప్పున పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దీంతో పెట్రోల్‌ రూ.97.01, డీజిల్‌ 88.27గా ఉన్నాయి.  
 
కాగా, మంగళవారం.. గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో కంటే రూ.50 అధికమవడంతో హైదరాబాద్‌లో 14 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.1002కు చేరింది

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు