దేశంలో మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. ఉత్పత్తి చేస్తున్న క్రూడాయిల్ పరిమాణాన్ని తగ్గించేందుకు ఒపెక్ అంగీకరించేలా లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో బ్యారల్ క్రూడాయిల్ ధర మరింత తగ్గింది. మంగళవారం సెషన్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారల్‌కు 9 సెంట్లు తగ్గి 79.59 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ ధర మరింతగా తగ్గవచ్చని నిపుణుల అంచనా.