ఆర్బీఐ మాజీ గవర్నర్‌కు ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ కూడా లేదు : సుబ్రమణ్య స్వామి

శుక్రవారం, 26 ఆగస్టు 2016 (14:23 IST)
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామికి ఉన్న పగ, ద్వేషం ఇంకా చల్లారినట్టు కనిపించడం లేదు. ఫలితంగా మరోమారు ఘాటైన విమర్శలు చేశారు. ఆర్బీఐ గవర్నర్ పదవిలో ఉన్న రాజన్‌కు కనీసం ఎకనామిక్స్‌లో డిగ్రీ కూడా లేదని ఆయన ఆరోపించారు.  
 
'ఆర్బీఐ గవర్నర్‌గా ఎంపికైన ఉర్జిత్ పటేల్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. యాలే వర్సిటీలో డిగ్రీ కూడా పూర్తి చేశారు. అయితే రాజన్‌కు ఎకనామిక్స్‌లో కనీస డిగ్రీ కూడా లేదు. ఇంజినీరింగ్ తర్వాత నేరుగా మేనేజ్‌మెంట్ విద్యనభ్యసించిన రాజన్... ఎకనామిక్స్‌లో కనీస విద్యార్హత కూడా సాధించలేదు' అని స్వామి ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి