ఇకపై అకౌంట్ పోర్టబులిటీ : ఒకే బ్యాంక్ ఒకే అకౌంట్

ఆదివారం, 19 నవంబరు 2017 (11:03 IST)
ఇప్పటివరకు మొబైల్ పోర్టబులిటీ అనే మాట విన్నాం. ఇది కేవలం మొబైల్ నంబర్లకి మాత్రమే ఇలాంటి వ్యవస్థ ఉంది. కానీ తొలిసారి బ్యాంకింగ్ రంగంలోనూ ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు సన్నద్ధమవుతోంది. 
 
ఈ సంస్కరణల్లో భాగంగా తొలి దశలో ఒకే బ్యాంకులోని ఇతర అకౌంట్లు రద్దు చేస్తే.. రెండో దశలో ఇతర బ్యాంకుల ఖాతాలు రద్దు చేసి.. ఒక వ్యక్తికి ఒకే బ్యాంక్.. ఒకే అకౌంట్ ఉండేలా చేయనున్నారు. 
 
దీంతో కస్టమర్లకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలందించడంతో పాటు చట్ట విరుద్ధమైన లావాదేవీలకు అవకాశం లేకుండా పోర్టబిలిటీ సేవలను తేవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకర్లతో సమావేశమైన ఆర్బీఐ… దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతోంది. 
 
ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ల అనుసంధానం కూడా దీనికోసమే చేయిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ తరహా ప్రక్రియ ఇప్పటికే మొదలైంది కూడా. ఆధార్‌ అనుసంధానం పూర్తయ్యాక ఇది వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా సేవింగ్ అకౌంట్ పోర్టబిలిటీని అందుబాటులోకి తేనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు