ఆర్బీఐ ద్రవ్య పాలసీ కీలక నిర్ణయాలు - పెరగనున్న వడ్డీ రేట్లు

బుధవారం, 8 జూన్ 2022 (13:31 IST)
భారత రిజర్వు బ్యాంకు ద్వైమాసిక సమీక్షా సమావేశం బుధవారం జరిగింది. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాల్లో రెపో రేటును 0.05 శాతం పెంచింది. దీంతో బ్యాంకులు ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి. అదేవిధంగా వృద్ధిరేటును 7.2 శాతంగా కొనసాగించింది. ద్రవ్యోల్బణం అంచనాలు 6.7 శాతానికి పెంచాయి. సర్దుబాటు విధానాన్ని ఆర్బీఐ ఉపసంహరించుకుంది. 
 
2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతంగానే కొనసాగించినప్పటికీ ద్రవ్యోల్బణం అంచాలను మాత్రం పెంచింది. గతంలో 5.7 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఆర్బీఐ ఇపుడు దీన్ని 6.7 శాతానికి పెంచేసింది. 
 
అదేసమయంలో వృద్ధికి మద్దతుగా సర్దుబాటు విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ చ్చింది. ఇటీవలే ఈ సర్దుబాటు విధానాన్ని రద్దు చేసింది. ఇపుడు దీన్నే కొనసాగిస్తున్నట్టు తెలిపింది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 5.15 శాతానికి, బ్యాంకు రేటును  4.65 శాతానికి పెంచింది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష ఆగస్టు 2 - 4వ తేదీల మధ్య ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు