థర్డ్ పార్టీ మోసాలపై ఫిర్యాదు చేయండి.. ఎలాంటి చర్యలు తీసుకోం : ఆర్బీఐ కొత్త పాలసీ

శుక్రవారం, 12 ఆగస్టు 2016 (12:21 IST)
థర్డ్ పార్టీ మోసాలపై ఫిర్యాదు చేసే వారిపై ఇకపై ఎలాంటి చర్చలు తీసుకోరాదని భారతీయ రిజర్వు బ్యాంకు సరికొత్త పాలసీని ప్రకటించింది. బ్యాంకు కస్టమర్ల ప్రమేయం లేకుండా జరిగే థర్డ్ పార్టీ నేరాలపై వెంటనే సమాచారాన్ని బ్యాంకు అధికారులకు చేరవేసే ఖాతాదారులపై ఎలాంటి విచారణ ఉండదని పేర్కొంది. ఒకవేళ నాలుగు నుంచి ఏడు రోజుల్లో ఫిర్యాదు చేస్తే, గరిష్ఠంగా రూ. 5 వేల జరిమానాకు మించిన శిక్ష వేయరాదని కూడా ఈ నూతన విధానంలో ఆదేశించింది. 
 
సాధారణంగా ఖాతాలో మనకు తెలియకుండా డబ్బులు వచ్చి జమ అవుతుంటాయి. ఏటీఎంలో రూ.200 విత్ డ్రా చేయాలనుకున్న వేళ రెండు రూ. 500 కాగితాలు వస్తుంటాయి. ఏటీఎంలో ఎవరైనా విత్ డ్రా చేసిన వేళ, ఆ డబ్బు వారు వెళ్లిన తర్వాత వస్తుంది. ఇలాంటి సమాచారాన్ని బ్యాంకర్లకు తెలియజేసే వారిపై ఇకపై ఎలాంటి చర్యలు తీసుకోరని ఆర్బీఐ తన కొత్త పాలసీలో పేర్కొంది. 
 
ఇదేసమయంలో బ్యాంకు అధికారి తప్పుతో, నగదు లావాదేవీ తప్పుగా జరిగితే, కస్టమర్ ఫిర్యాదు చేసినా, చేయకున్నా ఆ డబ్బు తిరిగి ఖాతాలోకి జమ అవుతుంది. తప్పుడు లావాదేవీ గురించి ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ రూపంలో బ్యాంకు నుంచి సమాచారం అందిన నాటి నుంచి మూడు రోజుల కాలపరిమితిలో విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాల్సి వుంటుంది.  

వెబ్దునియా పై చదవండి