స్పైస్ జెట్‌ సరికొత్త ఆఫర్.. ఒక కిలోమీటర్‌కు రూ.1.75 పైసలు

బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (14:15 IST)
స్పైస్‌జెట్ చౌక ధరల్లో విమాన టిక్కెట్‌లను ప్రకటించి బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో తిరుగులేదనిపించింది. అంతర్జాతీయ మార్గాలలోనూ ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు స్పైస్‌జెట్ ఓక ప్రకటనను వెలువరించింది. దీని ప్రకారం దేశీయంగా కిలోమీటర్‌కు 1.75 చొప్పున, అలాగే అంతర్జాతీయంగా కి.మీకు రూ. 2.5 చొప్పున విమాన టిక్కెట్‌లను ఆఫర్ చేయనున్నట్లు పేర్కొంది. 
 
దేశీయంగా ఒకవైపు ప్రయాణానికి అన్ని ఇతర ఛార్జీలను కలుపుకుని రూ.899గా, అంతర్జాతీయ రూట్లలో రూ.3699లకు ప్రారంభ ధరతో టిక్కెట్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ ఫిబ్రవరి 5న ప్రారంభమై ఫిబ్రవరి 9న ముగుస్తుంది. కాగా ఇలా కొనుగోలు చేసిన టిక్కెట్‌ల ద్వారా సెప్టెంబర్ 25, 2019 వరకు ప్రయాణించవచ్చని సంస్థ పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు