బంగారు నగల తయారీలో నాణ్యత పాటించలేదనీ...

సోమవారం, 26 జులై 2021 (16:37 IST)
హైదరాబాద్ నగరంలో ఇద్దరు స్వర్ణకారులపై మరికొందరు వ్యక్తులు విచక్షణ రహితంగాదాడి చేశారు. బంగారు నగల తయారీలో నాణ్యత పాటించకపోవడంతో ఆగ్రహించిన కొందరు వ్యాపారులు వారిపై దాడి చేశారు. హైదరాబాద్లోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. 

ఈ వివరాలను పరిశీలిస్తే, చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెలపురా ప్రాంతంలో కొందరు బెంగాలీలు ఆర్డర్లపై బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. వీరికి ఇద్దరు తయారీదారులకు కొందరు వచ్చి బంగారు ఆభరణాలు చేయాలంటూ సూచించారు. 

నగల తయారీలో నాణ్యత పాటించకుండా నమ్మక ద్రోహం చేశారని స్వర్ణకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన వ్యాపారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఇద్దరు స్వర్ణకారులను సిలిండర్‌కు కట్టేశారు. అనంతరం విచక్షణ మరచి రెచ్చిపోయారు. 

కర్రలు, రాడ్లతో దాడి చేశారు. బాధితులు వదిలేయమని ప్రాధేయపడినా సరే నిందితులు వినలేదు. ఒకరి తరువాత ఒకరు ముకుమ్మడిగా దాడిచేశారు. ఒంటిపై వాతలు వచ్చేలా కర్కశంగా చావబాదారు. చుట్టు ఉన్నవారు కనీసం వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం కూడా చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు