ఉపాధి చూపుతున్న విదేశీ విశ్వవిద్యాలయాలు

శుక్రవారం, 23 నవంబరు 2007 (18:58 IST)
విదేశాలలో పెద్ద పెద్ద నగరాలలోని విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలలో బహుళజాతి సంస్థలు ఉద్యోగ సంతలను (జాబ్ మేళా) నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎగరేసుకు పోతున్నాయి.

అదే విధంగా కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ మరియు మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులకు బహుళజాతి సంస్థలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. తర్వాతి స్థానాన్ని పెట్రోలియం, ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు ఆక్రమించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో విదేశీవిద్యాలయాలలో ఇటీవల జరిగిన ఉద్యోగ సంతల ఫలితాలను పరిశీలిద్దాం. అరిజోనా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఉద్యోగ సంతలో ఇంటెల్ మరియు ఎనలాగ్ డివైజెస్ కంపెనీలు కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలను కల్పించాయి.

క్లెమ్సెన్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్సు విద్యార్థులను మోటరోలా కంపెనీ ఎంపిక చేసుకుంది. ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయం నుంచి ఐబీఎం, డ్యూక్ ఎనర్జీ, మైక్రోసాఫ్ట్, జాన్సన్ కంట్రోల్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాయి.

వెబ్దునియా పై చదవండి