బయో ఇన్ఫర్మేటిక్స్‌తో ఆధునికత సంతరించుకున్న జీవశాస్త్రం

సమాచార, సాంకేతిక రంగాలతో జీవశాస్త్రాన్ని కొత్త రూపురేఖలు అద్దుతోంది బయో ఇన్ఫర్మేటిక్స్‌. జన్యువుల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆధునిక సమాచార, సాంకేతికత తళుకులుతో రంగరించటమే ఈ బయో ఇన్ఫర్మేటిక్స్‌.

దీనివల్ల విలువైన సమాచారాన్ని విశ్లేషించి జీవశాస్త్రాన్ని తర్వాత తరాలకు శాస్త్రవేత్తలు అందిస్తారు. పశ్చిమ దేశాల్లో బయో ఇన్ఫర్మేటిక్స్‌‌కు ఎనలేని ప్రాధ్యాన్యత ఇస్తున్నారు. అయితే మనదేశంలో ఈ తరహాకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు.

మనదేశంలో ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు ఔషధ, అధ్యయన సంస్థలు బయో ఇన్ఫర్మేటిక్స్‌కు అలవాటు పడ్డాయి. ఈ కోర్సులను డిప్లొమా, పీజీ డిప్లొమా తరహాలో విద్యాసంస్థలు అందిస్తున్నాయి.

అయితే పూర్తిస్థాయి పీజీ కోర్సును అందించే సంస్థలను వేళ్లమీదనే లెక్కపెట్టవచ్చు. అభ్యర్దులు డిగ్రీ, పీజీ స్థాయిలో కంప్యూటర్ సైన్స్, కెమికల్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఫార్మసీ గ్రాడ్యుయేట్లు వంటి కోర్సులు చేసిన వారు అర్హులు. ఈ కోర్సును చేసిన తర్వాత అధ్యయనం (పీహెచ్‌డీ) పై దృష్టిపెడితే విద్యార్దులకు మంచి భవిష్యత్తు ఉంది.

వెబ్దునియా పై చదవండి