తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు 2008 సంవత్సరంలో పని భారం పెరగనున్న నేపథ్యంలో వారికి సహకరించేందుకుగాను 200 నుంచి 250 మందిని నిర్వహణా ఉద్యోగులుగా నియామకాలు జరుపనున్నట్లు అమెరికా ఎయిర్‌లైన్స్ సోమవారం ప్రకటించింది. డిసెంబర్ మాసంలో ప్రారంభం కానున్న ఈ నియామకాల కార్యక్రమం 2008 సంవత్సరం తొలి త్రైమాసికం ముగిసేంతవరకు కొనసాగుతుంది.
కొత్త నియామకాలతో అమెరికాలోని మూడు ఓవర్‌హవుల్ బేస్‌లైన తుల్సా, ఓక్లా, ఫోర్ట్ వర్త్, టెక్సాస్ మరియు కాన్సాస్ నగరంతో పాటు ఎయిర్‌లైన్స్ వ్యవస్థకు చెందిన లైన్ మెయిన్‌టెనెన్స్ సదుపాయాలపై సత్ఫలితాలను చూపుతాయి.
2008 మరియు ఆపైన మా అవసరాలను సమీక్షించిన సందర్భంలో నిర్వహణా సిబ్బందిని పెంచడం ద్వారా కంపెనీని ఉత్తమ శ్రేణి కంపెనీగా నిలబెట్టేందుకు ప్రయత్నించవచ్చునని భావించినట్లు అమెరికన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్‌మైన్ రోమనో తెలిపారు. మరికొద్ది మాసాలపాటు కొనసాగే ఈ నియామక ప్రక్రియలో అమెరికన్‌తో తమ కెరీర్‌కు శ్రీకారం చుట్టేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు కార్‌మైన్ పేర్కొన్నారు.