ఎన్నారైలకు ఇక ద్వంద్వ పౌరసత్వం

ప్రవాస భారతీయులు ఎన్నేళ్ల నుంచో కోరుతున్న ద్వంద్వ పౌరసత్వ విధానానికి భారత ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. దీంతో దాదాపు 20 మిలియన్ల మంది ప్రవాస భారతీయులకు ప్రయోజనాలు చేకూరతాయి. అయితే వివిధ మార్గాల్లో ఇప్పటికే ద్వంద్వ పౌరసత్వాన్ని అందచేస్తున్న దేశాల్లోని ప్రవాస భారతీయులకే దీనిని పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

తాజా నిర్ణయం నేపథ్యంలో భారత పౌరసత్వ చట్టం (1955), విదేశీ భారతీయ వ్యవహారాలను చూసే శాఖకు సంబంధించిన కొన్ని నిబంధనలను సవరిస్తారు. ఈ ద్వంద్వ పౌరసత్వం పొందే ప్రవాస భారతీయులకు పలు విధాలుగా ప్రయోజనకారిగా ఉండే స్మార్ట్‌ కార్డ్‌లను అందచేస్తామని సమాచార ప్రసార శాఖా మంత్రి ఎస్‌ జైపాల్‌ ర్డెడి తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా పొందవచ్చు.

వెబ్దునియా పై చదవండి