నిరుద్యోగుల పాలిట వరం: ఉద్యోగ వెబ్‌సైట్లు

చదువు(కొని)కోవడం ఓ ఎత్తయితే చదివిన వారికి ఉద్యోగం లభించడం అంతకన్నా కష్టమైపోతోంది. దీంతో తాము ఇంత పెద్ద కోర్సులు ఎందుకు చేశామోనని నిట్టూర్పులు విడవడం యువకులకు షరా మామూలైపోతోంది. ఈ పరిస్థితే వారిని నేరసమాజం వైపు తీసుకువెళుతోందని కూడా చెప్పవచ్చు. ఉద్యోగాలతో తీరిక లేకుండా గడిపేవారు నేరాలకు పాల్పడటం అతి తక్కువగానే ఉంటుంది. అందుకే చదువుకొన్న వారు తగిన గట్టి ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం దొరకక మానదు.

అందుకు ఇదివరకే ఉద్యోగాలలో ఉన్న వారే నిదర్శనం. తమ కన్నా తక్కువ మార్కులు సాధించిన వారు కూడా ఉద్యోగాలలో చేరుతుండటాన్ని చూసైనా స్ఫూర్తి పొందాలి. అయితే ఎలా ప్రయత్నించాలి అనుకునే వారి కోసం ఉద్యోగ సమాచారాలు అందించే కొన్ని వెబ్‌సైట్ల వివరాలు పొందు పరిచాం. వాటి ద్వారా ఉద్యోగ ఖాళీల వివరాలు తెలుసుకుని ఆత్మవిశ్వాసంతో దరఖాస్తు చేయండి.

వెబ్దునియా పై చదవండి