బ్రిటన్లోని హేరియట్ వాట్ విశ్వవిద్యాలయం సివిల్ ఇంజినీరింగ్ కోర్సు బోధనలో విశిష్టమైంది. సివిల్ ఇంజినీరింగ్లో మాస్టర్ డిగ్రీ స్థాయి వరకు విశ్వవిద్యాలయం కోర్సులను విద్యార్థులకు అందజేస్తోంది. తరగతి గదిలోనే కాక ప్రాక్టికల్ శిక్షణను ఇవ్వడం ద్వారా సివిల్ ఇంజినీరింగ్ కార్యకలాపాల పట్ల విద్యార్థులలో సమగ్రమైన అవగాహన కలిగించే రీతిలో అధ్యయనం చేసుకునే అవకాశాన్ని విశ్వవిద్యాలయం సిలబస్ అందిస్తోంది.
ఈ విశ్వవిద్యాలయంలో 140 దేశాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 1821 సంవత్సరంలో నెలకొల్పబడిన ఈ విశ్వవిద్యాలయం బ్రిటన్లోని ఎనిమిదవ అతిపురాతనమైన విశ్వవిద్యాలయంగా ప్రత్యేక గౌరవాన్ని పొందింది. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో 140 దేశాలకు చెందిన 15000 పైచిలుకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సివిల్ ఇంజినీరింగ్లో ఎమ్ఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో కోర్సులను విశ్వవిద్యాలయం అందిస్తోంది.