అస్వస్థ ఎయిహోస్టెస్‌లకు వైద్యులతో చెక్

అస్వస్థ(సిక్) సెలవులతో నిరసనకు దిగుతున్న ఎయిర్ హోస్టస్‌లకు ఆ సంస్థ వైద్యులతో చెక్ పెడుతోంది. అసలు అస్వస్థతకు గురయ్యారా... లేక సిక్ సెలవు పెట్టి నిరసనకు దిగుతున్నారా అనే అంశంపై ఎయిర్ సంస్థలు తనిఖీలు చేపట్టాయి. అలా అస్వస్థత పేరుతో ఇళ్ళవద్ద ఉన్నవారిని వెంటనే సస్పెండ్ చేయాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో 10 మందిని సస్పెండ్ చేశారు. జూనియర్లు రూ. 28 వేలు తీసుకుంటుండగా, సీనియర్లు ఒక లక్ష వరకూ వేతనం తీసుకుంటున్నారు. దీనినిపై ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్‌హోస్టెస్‌లు నిరసన తెలుపుతూ సామూహికంగా అస్వస్థ సెలువుపై వెళ్లారు. దీనిని ఆ విమానయాన సంస్థ చాలా సీరియస్‌గా తీసుకుంది.

ఎయిర్‌హోస్టెస్‌ల ఇళ్ళ వద్దకు వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకూ డాక్టర్ల బృందాన్ని నియమించారు. వారు స్వస్థతతలో ఉన్నట్లు తేలితే వెంటనే సస్పెండ్ చేస్తున్నారు. అలాగే వారి అస్వస్థతపై ఆసుపత్రులలో విచారణ చేస్తున్నారు. ఆదివారం జరిగిన తనిఖీలో ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌లకు సస్పన్షన్ లేఖలు సిద్ధం చేశారు. దీంతో ఒకరిద్దరు ఎయిర్ హోస్టెస్‌లు విధులలో చేరిపోయారు.

వెబ్దునియా పై చదవండి