దేశ వ్యాప్తంగా నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షా విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం విధానంలో పలు లోపాలు ఉన్నట్టు గుర్తించారు. దీనిపై పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ఆ కమిటీ సూచన మేరకు ప్రిలిమినరీ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని సూచించింది.
తద్వారా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను తక్షణం తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే.. ఇంటర్వ్యూ విధానాన్ని కూడా వీడియోలో చిత్రీకరించాలని సూచించారు. దీనివల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగకుండా చూడొచ్చని భావన. అలాగే ఇంటర్వ్యూ సమయాల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను ప్రత్యేకంగా చూడటం చట్టాలను అతిక్రమించడమేనని పేర్కొంది. అయితే.. ఈ కమిటీ సూచనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తేగానీ.. ఆచరణకు నోచుకోవు.