మానవ వనరుల విభాగానికి ఉజ్వల భవిష్యత్తు

ఈ మధ్యకాలంలో ఏ కంపెనీకి వెళ్ళినా ఓ కొత్త పదవి పేరు వినిపిస్తోంది. నిన్న మొన్నటి దాకా కేవలం బహుళ జాతి కంపెనీలకే పరిమితమైన ఆ పోస్టు ప్రస్తుతం దేశీయ సంస్థల్లోనూ మార్మోగిపోతోంది. అదే మానవ వనరుల విభాగాధిపతి(హెచ్ ఆర్). ఈ విభాగాలో నిపుణులైన వారి అపారమైన అవకాశాలున్నాయి.

ఈ విభాగం ఒకప్పుడు నామమాత్రంగా పని చేసేది. ప్రస్తుతం ఉన్న పళంగా వృత్తికి గిరాకీ పెరిగిపోయింది. ఉద్యోగులను తీసుకోవడం, వద్దనుకుంటే తీసేసే కార్యక్రమాన్ని మాత్రమే కలిగిన ఈ విభాగం ప్రస్తుతం విశేష అధికారాలను బాధ్యతలను కలిగి ఉంటోంది. ఏ సంస్థకైనా ఉద్యోగులే ప్రాణం... ఊపిరి.

ఉత్పత్తి సక్రమంగా జరగాలంటే ఖచ్చితంగా ఉద్యోగులపై ఆధార పడాల్సిందే. ఇందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. ఇందుకు మానవ వనురుల విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో విభాగాధిపతితో పాటు ఒకరిద్దరు సహాయక ఉద్యోగులు ఉంటారు. ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగి నుంచి మంచి ఫలితాలను సాధించడానికి ఈ విభాగం కృషి చేస్తుంది.

ఉద్యోగులకు వృత్తిలో అవసరమైన మెళుకువలు నేర్పడం. తర్పీదు ఇవ్వడం వంటి అంశాలు ప్రధానమైనవి. ఉద్యోగలను ప్రోత్సహించడం ప్రధాన అంశం. పని బాగా చేసే వారికి ప్రోత్సహకాలు ప్రకటించడం వంటివి వీరి బాధ్యతలు. ఉద్యోగుల అవసరాలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక విధంగా బాధ్యతాయుతమైన పదవి. ప్రస్తుత పరిస్థితులో ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇందుకోసం చాలా విద్యాసంస్థలు ప్రత్యేక కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే జీత భత్యాలు కూడా ఉన్నాయి. బహుళ జాతి సంస్థల్లోనైతే యేటా కనీసం రూ.7 నుంచి 14 లక్షల వరకు వేతనాలు అందుతున్నాయి. విదేశాలలోనైతే ఏకంగా రూ. 19 నుంచి 20 లక్షల వరకూ వేతనాలు అందుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి