మనిషి జీవిత చక్రంలో సమయం అత్యంత కీలకమైంది. దీని విలువ తెలుసుకుని నడుచుకుంటే జీవితంలో వృద్ధిలోకి వస్తారు. లేకుంటే.. సోమరిపోతుగానే జీవితాన్ని గడపక తప్పదు. అలాంటి విలువైన సమయంలో మీరు వృధా చేసే సమయం విలువ నేటి యువత తెలుసుకోవాల్సిందే. లేకుంటే వారి జీవితాలు వ్యర్థం కావడం ఖాయమని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
ఉదాహరణకు ఒక వారం రోజులకు 168 గంటలు. ఇందులో 60 గంటలు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే చాలా గొప్ప అని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. 168 గంటల్లో టీవీలు చూడడం, స్నానాలు చేయడానికి, కాలకృత్యాలు తీర్చుకునేందుకు, సిన్మాలు షికార్లకు, తదితర పనులు మినహాయించి 60 గంటలు సద్వినియోగం చేసుకుంటే ఎంతో సమయం సద్వినియోగం చేసుకున్నట్టేనని శాస్తవ్రేత్తలు అంటున్నారు.
అలాగే, ఈ ఆధునిక టెలికామ్ యుగంలో ఒక యేడాదిలో ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడే సమయం గరిష్టంగా మూడు నెలలుగా ఉంటుందని శాస్త్రవేత్తలు లెక్కవేశారు. ఇలాంటి అనేక విషయాలను పరిశీలించినపుడు ఒక మనిషి జీవితకాలంలో ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారో ప్రతి ఒక్కరూ గ్రహించాలి.
ముఖ్యంగా, నేటి యువత ఒక కార్యాన్ని లేదా పనిని అనుకున్నప్పుడు దాన్ని వాయిదా వేస్తుంటారు. ఇలా వాయిదా వేయడమంటే వారికి మహా సరదా కూడా. కానీ, ముఖ్యమైన పనులన్నీ పక్కన పెట్టి కొన్ని టీవీ ఛానల్స్‌లో వచ్చే ఏమాత్రం ఉపయోగంలేని కార్యక్రమాలను చూడడానికి అత్యుత్సాహం చూపుతారు. దీనివల్ల ఎంతో సమయం వృధాగా కరిగిపోతుంది.