సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల పరీక్షా ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా, టెన్త్ రెండో టర్మ్ ఫలితాలను జూలై నాలుగో తేదీ సోమవారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ, ఫలితాలను మాత్రం వెబ్‌సైట్‌లో పెట్టలేదు. దీనికితోడు వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో ఫలితాలు వెల్లడించారా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.
తాజాగా సమాచారం ప్రకారం టెన్త్ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. టర్మ్ 1, 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ యేడాది 10, 12 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జూన్ 15వ తేదీ వరకు జరిగిన విషయం తెల్సిందే. ఈ ఫలితాలను cbse.gov.in లేదా cbseresults.nic.in అన్ వెబ్ సైట్లలో చూసుకోవాల్సివుంటుంది. మరోవైపు, ప్లస్ 2 పరీక్షా ఫలితాలు ఈ నెల 12వ తేదీన వెల్లడించనున్నారు.