జోరుగా సాగుతున్న ఎంసెట్ పరీక్షా ఏర్పాట్లు

ఎంసెట్-2009 పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మొత్తం 749 కేంద్రాల్లో ఈనెల 14న ఎంసెట్ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంసెట్ పరీక్షకు ఈసారి 3,11,619 దరఖాస్తులు అందినట్టుగా అధికారులు తెలిపారు.

ఎంసెట్ పరీక్ష ముగిసిన తర్వాత జూన్ ఒకటిన ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఫలితాల విడుదల సందర్భంగా కేవలం మార్కులు మాత్రమే వెల్లడించనున్నారు. దీని తర్వాత జూన్ 20న జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) ర్యాంకులను ప్రకటిస్తుంది.

అటుపై ఇదే నెల 30న విద్యార్థులుకు ర్యాంకు కార్డుల పంపిణీ ప్రారంభమవుతుంది. దీని తర్వాత విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలన జరుగుతుంది. ఈ సమయంలో వెబ్ ఆధారిత విధానం కింద కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు అవసరమయ్యే పాస్‌వర్డ్‌ను విద్యార్ధులకు అందజేస్తారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 39 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి