పాటిలో కాప్ కమ్యూనిటీ కాలేజ్ ప్రారంభం

మెదక్ జిల్లాలోని పాటిలో ఏర్పాటయిన కాప్ కమ్యూనిటీ కాలేజ్ ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సులు, రెండేళ్ల అసోసియేట్ డిగ్రీ, ఏడాది డిగ్రీ కోర్సులను అందిస్తోంది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఐజీఎన్ఓయూ) సహకారంతో కాప్ పౌండేషన్ పాటి గ్రామంలో ఏర్పాటు చేసిన కాప్ సెంటర్‌ను విశ్వవిద్యాలయ ఉపకులపతి లతా పిళ్లై ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా ఐజీఎన్ఓయూ ఇటువంటి 100 కమ్యూనిటీ కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి డి.పురందేశ్వరి జులై 4న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయి. ఏవో కారణాలతో చదువును మధ్యలో నిలిపివేసిన విద్యార్థులకు ఇక్కడ ప్రత్యేక కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. వారిని పట్టభద్రులను చేస్తారు.

వెబ్దునియా పై చదవండి