మారిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అలాగే, ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు 23వ తేదీ నుంచి నిర్వహిస్తారు. అంటే తొలుత ప్రకటించిన షెడ్యూల్‌కు రెండు రోజులు ఆలస్యంగా ఈ పరీక్షలు జరుగుతాయి.
నిజానికి మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 20వ తేదీన, ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రారంభంకావాల్సివుంది. కానీ, జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఇంటర్ ఫలితాల్లో మార్పులు చేసింది.