డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సులు.. ఉచితంగా శిక్షణ

శనివారం, 27 జూన్ 2020 (15:25 IST)
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఆన్‌లైన్ కోర్సుల్లో భాగంగా డిజిటల్ ఫౌండేషన్, వెబ్ డెవలపింగ్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కోర్సులను అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కోర్సులను అందించడానికై ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఐబీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. 
 
మరోవైపు శాటిలైట్ అనుబంధ అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించి, వాటిలోనూ ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ముందుకువచ్చాయి. మరిన్ని వివరాల కోసం https://www.apssdc.in/home/ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.
 
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విద్యాసంస్థలన్నీ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.  గత మూడు నెలలుగా విద్యార్థులు కాళీగానే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆన్ లైన్ కోర్సుల ద్వారా విద్యార్థులకు మేలు చేయొచ్చునని ఏపీ సర్కారు భావించింది. ఇందులో భాగంగానే ఉచితంగా ఆన్ లైన్ కోర్సులకు రంగం సిద్ధం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు