నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 93 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్

గురువారం, 12 నవంబరు 2020 (16:42 IST)
నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు 93 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ అసిస్టెంట్, ఎస్ఎఎస్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 
 
ఎంపికైన అభ్యర్థులు డాక్టర్ అంబేద్కర్ నేషనల్ ఇన్సిస్టూట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్‌లో పని చేయాల్సి ఉంటుంది. పోస్టు ఆధారంగా వేతనాలు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. గరిష్ట వేతనం రూ. 1,12,240.
 
ఈ కేటగిరీలో మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. బయోటెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీయల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఇనస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తదితర కోర్సుల్లో బీఈ, బీటెక్, డిప్లొమా, బ్యాచలర్స్, మాస్టర్ డిగ్రీలను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు