తెలంగాణాలో నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు

గురువారం, 30 జూన్ 2022 (08:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో గురువారం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడికానున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల భవన సముదాయంలో ఉన్న విద్యాశాఖ కార్యాలయంలో విద్యామంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను వెల్లడించనున్నారు. 
 
విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.in, www.ntnews.com అనే వెబ్ సైట్‌లలో చూడొచ్చు.
 
కాగా, మే నెల 23వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 5,08,143 మంది రెగ్యులర్ విద్యార్థులు, 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాయగా, 167 మంది ప్రైవేట్ విద్యార్థులకు 87 మంది రాశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు