రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 511 ఖాళీలు ఉండగా, ఇందులో జనరల్ కేటగిరీ కింద 311, ఎస్సీలకు 69, ఎస్టీలకు 40, ఓబీసీలకు 91 చొప్పున పోస్టులు ఉన్నాయి.

వేతన శ్రేణి కింద రూ.9300-34800 చొప్పున చెల్లిస్తారు. డిగ్రీ లేదా తత్సమానం పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1986 జూలై ఒకటో ఒకటో నుంచి 1991 జూలై ఒకటో తేదీ మధ్య జన్మించి ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తులను మే 30వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తులను చీఫ్ సెక్యూరిటీ, కమిషనర్ / ఆర్‌పీఎఫ్, సౌత్ సెంట్రల్ రైల్వే, రైల్ నిలయం, పోస్ట్ బాక్స్ నెం. 7101, సికింద్రాబాద్‌కు పంపించాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి