భారతీయ నౌకాదళంలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ - జీఎస్ లేదా హైడ్రోక్యాడర్) జనవరి 2012 కోర్సులో భాగంగా షార్ట్ సర్వీస్ కమిషన్డ్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సైన్స్ గ్రాడ్యుయేట్లు (ఫిజిక్స్, మ్యాథమేటిక్స్‌లో 60 శాతం మార్కులు తప్పనిసరి), 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత, ఎన్సీసీ నావెల్ వింగ్ సీనియర్ డివిజన్ ‘సి’ సర్టిఫికెట్ ఉన్న వారు అర్హులు.
అలాగే, ఆపరేషన్స్ అనాలిసిస్ అండ్ ఆపరేషనల్ రీసెర్చ్/క్వాంటిటేవ్ మెథడ్స్‌లో 75 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్లు పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 యేళ్ళకు మించకూడదు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 27వ తేదీలోపు పంపుకోవాల్సి ఉంది.