చెన్నైలో మసాజ్ సెంటర్లలో సోదాలు... మహిళలు అరెస్టు

మంగళవారం, 23 నవంబరు 2021 (08:55 IST)
ఇటీవలి కాలంలో చెన్నై మహానగరంలో కూడా మసాజ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అనుమతి లేకుండా ఈ సెంటర్లను ప్రారంభిస్తున్నారు. ఇలాంటి కేంద్రాల్లో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఇలాంటి కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో అనేక మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇటీవల వ్యభిచార నియంత్రణ విభాగంలో పనిచేసే ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. వీరిద్దరూ చెన్నై నగరంలోని మసాజ్ సెంటర్లు, స్పాలు, స్టార్ హోటళ్ళ నుంచి లక్షలాది రూపాయలను లంచంగా తీసుకుంటున్నట్టు తేలింది. దీంతో గత రెండు రోజులుగా ప్రత్యేక బృందాలు మసాజ్ సెంటర్లు, స్పాలపై దృష్టిసారించి ఆకస్మిక తనిఖీలు చేశారు.
 
ఈ తనిఖీల్లో పలు మసాజ్ సెంటర్లు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలు, మహిళలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆ సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఈ కేంద్రాల్లో మసాజ్ చేసేందుకు నియమించుకున్న 8 మంది మహిళలకు విముక్తి కల్పించారు. ప్రస్తుతం చెన్నైలో మొత్తం 151 మసాజ్ సెంటర్లు ఉండగా, వీటిలో 63 సెంటర్లకు అనుమతులు లేవని తేలింది. దీంతో ఈ సెంటర్ల నిర్వాహకులకుపై పోలీసులు కేసులు నమోదు చేసి సీలు వేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు