ఈ లోకంలో వింతలకు విశేషాలకు కొదవే లేదు. అసలు విషయం ఏంటంటే... వేలూరు జిల్లా వాణియంబాడి సమీపంలో నరికిన మామిడి కొమ్మ నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25కి పైగా కాయలు కాసి గ్రామస్థులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాణియంబాడి ఆలంకాయం కలరపట్టి ప్రాంతానికి చెందిన మాజీ ప్రధానోపాధ్యాయుడు పడవేట్టానకు చెందిన మామిడి తోటలోని ఓ వృక్షం కొమ్మను ఈ మధ్యనే నరికేశారు.