మీ చిన్నారుల విషయంలో చేయకూడనివి...!

* పిల్లలు మీ ముందు భయపడాలన్న భావనను వదిలంచుకోవాలి. మీ ఆధిపత్యాన్ని వారిపై చూపించవద్దు. అమ్మాయిని ఒకలాగ, అబ్బాయిని మరో రకంగా చూడకూడదు. అపరిచితుల ముందు, పిల్లలకంటే చిన్నవారి ముందు వాళ్లను తిట్టటం, కొట్టటం లాంటివి చేయక పోవటం మంచిది.

* మిగతా పిల్లల్లో ఉండే గొప్పదనాన్ని అస్తమానం మీ చిన్నారులకు గుర్తు చేస్తూ.. వారిని హేళన చేయటం తగదు. తెలిసో తెలియక పిల్లలు చేసే ప్రతి ప్రయత్నాన్నీ ఖండించవద్దు. "నీకేం తెలియదు పో" అంటూ కసురుకోకూడదు. అలాగే అబ్బాయి లేదా అమ్మాయి అడిగిందల్లా కొనివ్వటం, అతిగారాబం మంచిది కాదు.

* "ఇది తినొద్దు, అది తినొద్దు.. మీకు పడదు" అంటూ పిల్లల్ని అన్నింటికీ దూరంగా ఉంచితే అది వారి ఆరోగ్యం పాలిట అనారోగ్యమై కూర్చుంటుంది. ప్రతి విషయంలోనూ వారికి ఏదీ దక్కకుండా నియంత్రించి.. అదుపులో ఉంచాలని చూస్తే, వాటిని దక్కించుకునేందుకు పిల్లలు అబద్దాలు, దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది.

* అతి ముఖ్యమైన, విలువైన పత్రాలు, వస్తువులు పిల్లల చేతికి అందేలా ఉంచవద్దు. పిల్లలు ఏం మాట్లాడినా ముద్దుగానే ఉంటుంది. కానీ వాళ్లకు అశ్లీల పదజాలం, బూతు మాటలు అలవాటవకుండా జాగ్రత్తపడాలి. అతిగా గారాబం చేసే, బూతు మాటలు నేర్పించవారి వద్దకు పిల్లల్ని చేరనీయకూడదు.

వెబ్దునియా పై చదవండి