లివింగ్ రూమ్‌లో బుడిబుడి నడకల పాపాయి

WD
పిల్లలకి నడక వచ్చిన తర్వాత ఇక ఉన్నచోట ఉండరు. బుడిబుడి అడుగులతో అటూ ఇటూ తిరుగుతూనే ఉంటారు. అవీ ఇవీ నేర్చుకునే, చేసే ప్రయత్నం మొదలుపెడతారు. పిల్లలు వివిధ విషయాలు నేర్చుకోవడం సలువుగా జరిగేటట్లు చూసుకోవాల్సింది తల్లిదండ్రులే.

కొంచెం జాగ్రత్త పడితే పిల్లల్ని పెంచడమనే బాధ్యతలో ఆనందం పొందగలరు. చిన్నిపిల్లలు ఉన్నవారు కొన్ని చర్యలతో ఇంటిని భద్రమైన ప్రదేశంగా మార్చాలి.

లివింగ్ రూమ్‌లో...
ఇంట్లో చిన్న పిల్లలుంటే గ్లాస్ టాప్ టేబుల్స్, టీపాయ్‌లు వాడవద్దు. అద్దాలు వాడిన ఏ ఫర్నీచర్‌ను కొనవద్దు.

మూలలు పదునుగా ఉండే ఫర్నిచర్‌ను దూరంగా ఉంచండి. మూలలు గుండ్రంగా ఉన్న ఫర్నిచర్ కొనండి. ఇప్పటికే పదునైన మూలలున్న ఫర్నీచర్ మీ ఇంట్లో ఉంటే ఆ మూలల్లో కుషన్ లేదా పాడింగ్ ఏర్పాటు చేయండి. ఏ ప్రమాదం ఉండదు.

మీ పిల్లలు కుర్చీలు, బల్లలపై ఎక్కడం మొదలుపెడితే, అలాంటివి కిటికీలకు దగ్గరగా లేకుండా చూసుకోండి. వీలైనతం దూరంగా ఉంచండి.

పాతబడిన, జారుతున్న డోర్‌మేట్లను వాడకుండా అవతల పడేయండి. చిరుగులు పడిన తివాచీలను కూడా అక్కడ నుండి తీసివేస్తే మరీ మంచిది.

వెబ్దునియా పై చదవండి