* వేసవికాలంలో వివిధ పనుల రీత్యా బయటకు వెళ్లే పెద్దవాళ్లు, కళ్లకు చల్లదనం కోసం "చలువ కళ్లద్దా"లను వాడటం పరిపాటి. అయితే వేసవిలో పాఠశాలలకు సెలవులు ఇవ్వటంతో పిల్లలు ఎండలో ఎక్కువగా తిరగటం, ఆడుకోవటం లాంటివి చేస్తుంటారు. కాబట్టి పెద్దలు పిల్లలకు కూడా చలువ కళ్లద్దాలను కొనివ్వటం మంచిది.
* పిల్లల్ని ఎండలో బయటకు తీసుకువెళ్లాల్సి వస్తే.. వారి నెత్తిపై టోపీని పెట్టి తీసుకెళ్లాలి. అలాగే వారికి బాగా వదులుగా ఉండే దుస్తులను వేయాలి. ముఖ్యంగా కాటన్ బట్టలనే తొడిగించాలి. అంతేగానీ అందంగా ఉంటాయి కదా అని నైలాన్, సిల్క్ లాంటి బట్టలను ఎట్టిపరిస్థితులలోనూ పిల్లలకు వేయకూడదు. ఇంకా.. రోడ్లపై తిరిగేటప్పుడు వాహనాలు విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ను పిల్లలు పీల్చకుండా, పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకునేందుకుగాను పిల్లలకు చల్లగా ఉండే దుస్తులనే ధరింపజేయాలి. అది కూడా పిల్లలకు సౌకర్యంగా ఉండే మృదువైన నూలు దుస్తులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇవి పిల్లల శరీరానికి అంటుకుని ఉంటూ చల్లదనాన్ని అందిస్తాయి. దీంతో పిల్లలు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు.