పిల్లల్లో బొటనవేలు చీకే అలవాటు: నిమ్మరసంతో చెక్!

గురువారం, 30 అక్టోబరు 2014 (15:08 IST)
పిల్లలు పెరుగుతున్నప్పుడు బొటనవేలు చీకే అలవాటు మానటం సాధ్యం కాకపోవచ్చు. అందుచేత చిన్నప్పుడే ఈ అలవాటును దూరం చేయాలి. లేదంటే పిల్లల్లు అప్పుడప్పుడు రోగాల బారిన పడతారు. బొటనవేలు చీకే అలవాటుకు చెక్ పెట్టాలంటే.. 
 
పిల్లల బొటనవేలు చుట్టూ బ్యాండ్ ఎయిడ్ లేదా టేప్‌తో చుట్టాలి. లేకపోతే బొటనవేలికి తోలుబొమ్మ చేతితొడుగును తొడగాలి. పడుకొనే సమయంలో బొటనవేలు చీకుతూ ఉంటే సాక్స్‌ను ఉపయోగించవచ్చు.
 
పిల్లలకు నిమ్మరసం రుచి నచ్చదు. అందువల్ల పిల్లల బొటనవేలికి నిమ్మరసం రాయండి. మీరు ఈ పరిష్కారాన్ని పునరావృతం చేయవచ్చు. ఇది కెమికల్ ఆధారిత నెయిల్ పెయింట్ కంటే ఎంతో శ్రేయస్కరమని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి