పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించండి!

బుధవారం, 7 జనవరి 2015 (16:19 IST)
ఏ అంశాన్నైనా పిల్లలు ప్రశాంత వాతావరణంలో సులువుగా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్లో అలాంటి వాతావరణం కల్పించండి. చదువుకునే సమయంలో టీవీ కట్టేయండి. బిగ్గరగా మాట్లాడుకోవడం మానేయండి. పిల్లలకంటూ ఓ గదిని కేటాయించి అక్కడ చదువుకోమని చెప్పండి. 
 
పిల్లలకు ఏదైనా నేర్చుకోమని చెప్పినప్పుడు వాళ్లను గంటల తరబడి వదిలేయకూడదు. వాళ్లకు ఇచ్చిన పనీ, పిల్లల స్వభావాన్ని బట్టి ఓ సమయం పెట్టాలి. ఆ సమయంలోనే నేర్చుకునేలా చూడాలి. 
 
పిల్లలు ఆడే ఆటల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచే వాటిని చేర్చండి. మెమరీ గేమ్స్ అని ఉంటాయి. వాటిని వీలైనంత ఎక్కువగా ఆడించండి. అలాగే అవుట్ డోర్ గేమ్స్ కూడా సమయాన్ని బట్టి ఆడుకోనివ్వాలి. ఇలా చేస్తే పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

వెబ్దునియా పై చదవండి