పిల్లలకు మళ్లీ స్కూళ్ళు మొదలయ్యాయి. మరోవైపు చిరుజల్లులు. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు సరైన చర్యలు తీసుకోవాలి. తేమ తక్కువగా ఉండే ఈ వాతావరణంలో పిల్లలకు ర్యాషెస్ వస్తుంటాయి. ముఖ్యంగా కాలివేళ్ళు, పాదాలకు ఈ వాతావరణంలో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ. స్కూల్‌కు సాక్స్, షూస్ ధరించి వెళ్ళి ఎక్కువసేపు ఉండాల్సిరావడం వల్ల కాలి వేళ్ళ నడుమ తడి, చెమట చేరి ఫంగస్ సులువుగా పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రదేశాన్ని పొడిగా ఉంచుకోవాలి.
యాంటీ ఫంగల్ పౌడర్‌ను అద్దుకుని స్నాక్స్, షూ వేసుకోవాలి. తప్పనిసరిగా పిల్లలు రెండుపూటలు స్నానం చేయాలి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేశాక లేత రంగుల, వదులుగా వుండే కాటన్ దుస్తులు వేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు, ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా లభించే నిమ్మజాతి పానీయాలు తాగుతుంటే రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
రోలాన్‌లు, డియోడరెంట్‌లు వాడనీయకూడదు. వీటివల్ల చర్మ రంధ్రాలు మూసుకొని పోయి బాయిల్స్ వంటి ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. దోమలు, ఈగలు వంటి వాటిని దగ్గరకు రానీయకూడదు.