రాత్రిపూట 8 గంటలకల్లా పిల్లల్ని నిద్రపుచ్చండి.. లేకుంటే ఊబకాయం తప్పదండోయ్!

శనివారం, 16 జులై 2016 (16:59 IST)
రాత్రిపూట పిల్లలు ఆలస్యంగా నిద్రించడం.. ఉదయం లేటుగా లేవడం ద్వారా పిల్లల్లో ఊబకాయం తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. పిల్లల్ని రాత్రి 8 గంటలకే నిద్రపుచ్చడం.. మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేవడం ద్వారా పిల్లల్లో ఒబిసిటీ వచ్చే అవకాశాలు చాలామటుకు తగ్గుతాయని ఓహియో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తేల్చేశారు. 
 
సూర్యోదయానికి ముందే లేవడం బద్ధకమైనప్పటికీ.. ఈ అలవాటు ద్వారా పిల్లలు పెరిగే కొద్దీ ఊబకాయం ఇతర అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. తాము 977 మంది పిల్ల‌ల‌పై చేసిన అధ్య‌య‌నంలో ఈ విషయం వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలిపారు. రాత్రి 8 గంటల్లోపే నిద్రించే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నారని, 9 గంటలకు పైగా నిద్రించే పిల్లల్లో అనారోగ్య సమస్యలు, ఊబకాయం తప్పట్లేదని వారు చెప్తున్నారు. 
 
ఉద‌యం సూర్యోదయానికి ముందే లేచే పిల్లల్లో సానుకూల దృక్పథం పెరుగుతుందని పరిశోధనలో వెల్లడైంది. రాత్రి లేటుగా నిద్రించి.. ఉదయం కూడా లేటుగా లేచే పిల్లల్లో బద్ధకంతో పాటు నీరసం, ఊబకాయం వంటి సమస్యలు తప్పట్లేదని పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి