అరగంట తర్వాత పాలు లేదా అల్పాహారంగా నూనె వస్తువులు కాకుండా ఆవిరిలో ఉడికిన ఇడ్లీ వంటివి కారంలేకుండా ఇవ్వడం చేయాలి. అలాగే మధ్యాహ్నం పూట అందించే ఆహారంలో పప్పు దినుసులు, ఉడికించిన కూరగాయలు, కోడిగుడ్డు ఉండేలా చూసుకోవాలి. ఆరు నెలల నిండని పసిపిల్లలైతే తల్లిపాలు తప్పనిసరి. లేకుంటే ఆవు పాలును మితంగా ఇస్తుండాలి. ఫస్ట్ ఫుడ్ అలవాటు చేయాలి.
ఏడాది దాటిన పిల్లల ఆహారంలో విటమిన్స్, మినిరల్స్ ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు ఉడికించి సూప్‌ల రూపంలో ఇవ్వాలి. రోజుకో గుడ్డు, వారానికి మూడు లేదా రెండు సార్లు మాంసం పెట్టొచ్చు.
ఆవు పాలు మితంగా ఇవ్వాలి. ఇందులో కార్బోహైడ్రేడ్స్, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉండటంతో శిశువు పెరగటానికి ఎంతగానో ఉపకరిస్తుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.