పెద్దలకు గౌరవం ఇవ్వడం.. పిల్లలకు నేర్పించండి..!

గురువారం, 18 డిశెంబరు 2014 (18:24 IST)
పెద్దలకు గౌరవం ఇవ్వడాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. కొందరు పిల్లలు తమకంటే వయసులో పెద్దవారిని పేరుపెట్టి పిలుస్తారు. లెక్కలేనట్లుగా వ్యవహరిస్తారు. ఇటువంటివి మీ పిల్లలపై చెడు అభిప్రాయాన్ని కలిగిస్తాయి. ముందు మీరు ఇంట్లోని పెద్దలకు గౌరవం ఇవ్వడం ద్వారా వారికి అది తెలిసేట్లు చేయండి. బయటికెళ్లినప్పుడు ఇతరులకు సాయపడే తత్వాన్నీ, మర్యాదగా మాట్లాడే తీరుని అలవాటు చేయాలి. 
 
అలాగే ఊహ తెలిసే వరకూ మీరే దగ్గరుండి అన్నం తినిపిస్తారు. కానీ స్కూలుకి పంపించడం మొదలెట్టాక, పార్టీకో, ఫంక్షన్కో తీసుకెళ్లాల్సినప్పుడు సొంతంగా తినాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే తన లంచ్ బాక్స్ తెరవడం, చేతులు కడుక్కోవడం, పదార్థాలు దుస్తులు మీద పడకుండా తినడం వంటి ప్రాథమిక విషయాలను తెలపాలి.

వెబ్దునియా పై చదవండి