భార్యాభర్తలిద్దరూ ఆఫీసు కెళ్తున్నారా..? అయితే పిల్లల భద్రతపై ఎక్కువ శ్రద్ధ తీసుకోండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లిపోతే పనివాళ్లు, ట్యూషన్ టీచర్లు వస్తుంటారు. వారిలో మీ చిన్నారులకు హాని కలిగించే వారూ ఉండొచ్చు. అందుకే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని వాటిని మీ ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానం చేసుకోండి. మీ పాపను మీరెక్కడున్నా జాగ్రత్తగా కనిపెట్టుకోవచ్చు.