సంవత్సరంలోపు పిల్లలకు ఎగ్‌ వైట్ పెట్టొచ్చా?

గురువారం, 11 సెప్టెంబరు 2014 (18:36 IST)
సంవత్సరంలోపు పిల్లలకు ఎగ్‌ వైట్ పెట్టకూడదని న్యూట్రీషన్లు అంటున్నారు. ఎగ్ వైట్ చిన్నపిల్లలకు అంత మంచి ఎంపిక కాదు. ఎగ్ వైట్ చిన్న పిల్లల్లో పొట్ట సమస్యలను లేదా ఎగ్జిమాకు గురిచేస్తుంది. అలాగే పీనట్ బటర్ ఇవ్వడం కూడా మంచిది కాదు. 
 
పసిపిల్లలకు నివారించాల్సిన ఆహారాల్లో ద్రాక్ష కూడా ఒకటి. ఇవి పిల్లలకు పుల్లగా ఉండటం మాత్రమే కాదు, గొంతు సమస్యలకు గురిచేస్తుంది. 
 
అంతే కాదు, డయోరియాకు గురిచేస్తుంది. నల్లటి ద్రాక్షలు, ఎక్కువ పుల్లగా ఉండే ద్రాక్షలను ఎక్కువగా పెట్టకపోవడం మంచిది. వీటితో పాటు తేనె, చీజ్, స్ట్రాబెర్రీలు, తేనె, చాక్లెట్లు ఇవ్వకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి