అందుచేత తేలికగా జీర్ణమయ్యే ఫుడ్‌ను పిల్లలకు అందించాలి. పండ్లు, ముఖ్యంగా రోజుకో ఆపిల్ పండును పిల్లలకు పెట్టాల్సిందే. తద్వారా డాక్టర్ వద్దకు వెళ్లే ఖర్చును తగ్గించుకోవచ్చు. అలాగే లైట్ ఆహార పదార్థాలతో ప్రోటీనులు, విటమిన్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
బర్గర్లు, పిజ్జాలు వంటివి కొనిపెట్టడం కంటే.. ఇంట్లో తయారయ్యే సలాడ్స్, రోటీలు, వేడి వేడి స్నాక్స్ హోం మేడ్‌కే ప్రాధాన్యత ఇవ్వండి. వేడినీటితో తయారైన తాజా పండ్ల రసాలు వంటివి ఇవ్వడం చేస్తే పిల్లల ఆరోగ్యం చలికాలంలో మెరుగ్గా ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.